📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Latest News: Priyanka Chopra: SSMB 9 నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదల

Author Icon By Aanusha
Updated: November 12, 2025 • 9:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ చిత్రం ‘గ్లోబ్ ట్రాటర్’ నుంచి మరో భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్‌పై అనేక రూమర్స్, అంచనాలు వినిపిస్తుండగా, ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ చిత్రబృందం నటీమణి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.

Read Also: Sharwanand: విడాకుల వార్తల పై శర్వానంద్ క్లారిటీ!

‘And now she arrives… Meet MANDAKINI’ (ఆమె వస్తోంది… ఆమే మందాకిని) అనే క్యాప్షన్‌తో దర్శకుడు రాజమౌళి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ లుక్‌లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) చీరకట్టులో, హీల్స్ ధరించి, చేతిలో పిస్టల్ తో ఎంతో డైనమిక్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.

ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేశ్-రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ అప్డేట్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.‘RRR’ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Priyanka Chopra

అడవుల నేపథ్యంలో సాగే గ్లోబల్ అడ్వెంచర్

ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్-వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే క్రూరమైన విలన్ పాత్ర పోషిస్తున్నారు.

ఇక రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా పరిచయం కావడంతో ఈ ప్రాజెక్ట్ పై హైప్ ఇంకాస్త పెరిగింది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News Globe Trotter GlobeTrotterFirstLook latest news Mahesh Babu MaheshBabuSSRajamouliMovie Priyanka Chopra first look PriyankaAsMandakini SS Rajamouli Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.