📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Oscars 2026: ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా

Author Icon By Anusha
Updated: March 6, 2026 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Oscars 2026: నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) వేడుకలో ఆమె అవార్డు ప్రజెంటర్‌గా ఎంపికయ్యారు. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ నెల 15న జరగనున్న ఈ మహా వేడుకలో ప్రియాంక తన మెరుపులు మెరిపించనున్నారు.

Read Also: Naga Chaitanya: ఇది నా కెరీర్ లో బెస్ట్ సినిమా

హాలీవుడ్ దిగ్గజాలతో వేదికపై సందడి.. దశాబ్దం తర్వాత మళ్ళీ!

ఈ వేడుకలో ప్రియాంక కేవలం అతిథిగా మాత్రమే కాకుండా, హాలీవుడ్ అగ్ర నటులైన రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ వంటి దిగ్గజాలతో కలిసి వేదికను పంచుకోనుండటం విశేషం. గతంలో 2016లో కూడా ఆమె ఆస్కార్ ప్రజెంటర్‌గా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించగా, సరిగ్గా దశాబ్దం తర్వాత (10 ఏళ్ల తర్వాత) మళ్ళీ అదే గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించడంతో పాటు, ప్రియాంక సైతం తన సోషల్ మీడియా వేదికగా ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు మరో ప్రత్యేకత ఉండ‌బోతుంది. ప్రముఖ టీవీ హోస్ట్ కోనన్ ఓ’బ్రియన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, ప్రజెంటర్ల జాబితాలో ప్రియాంకతో పాటు అన్నే హాత్వే, గ్వినేత్ పాల్ట్రో, పాల్ మెస్కల్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈసారి ‘Sinners’ చిత్రం ఏకంగా 16 నామినేషన్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తమ నటుడి కేటగిరీలో లియోనార్డో డికాప్రియో, తిమోతీ చాలమెట్ వంటి హేమాహేమీల మధ్య గట్టి పోటీ నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

98th Academy Awards Updates Oscars 2026 Presenter Priyanka Chopra Robert Downey Jr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.