గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra), దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు కార్తికేయతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో హాట్ టాపిక్‌గా మారింది. వారణాసి నేపథ్యంతో నిర్మాణం జరుగుతున్న మహేశ్ బాబు భారీ చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తుండగా, కార్తికేయ ఈ ప్రాజెక్టుకు సహ నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read Also: Face Recognition Cameras: అత్యంత కట్టు దిట్టమైన భద్రతలో చర్లపల్లి రైల్వే స్టేషన్
కార్తికేయ జన్మదినం సందర్భంగా ప్రియాంక ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇద్దరూ సరదాగా ‘ఊర్వశీ ఊర్వశీ – టేకిట్ ఈజీ’ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్‌కు స్టెప్పులు వేసిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోను ఎక్స్ (Twitter)లో పోస్ట్ చేసిన ప్రియాంక, ఆయనకు హృదయపూర్వక బర్త్‌డే విషెస్ తెలిపారు.
ఈ సినిమా జర్నీలో నీతో కలిసి
“టేక్ ఇట్ ఈజీ మై ఫ్రెండ్! వెనక నుంచి నిశ్శబ్దంగా అన్ని పనులను అద్భుతంగా నిర్వహిస్తున్న కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమా జర్నీలో నీతో కలిసి డ్యాన్స్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ ప్రియాంక తన సందేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: