టాలీవుడ్‌లో ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న సినిమా SSMB29. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Superstar Mahesh Babu) హీరోగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్, (SSMB29 Update)ఇప్పటికే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రతి అప్‌డేట్‌పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా రాజమౌళి స్వయంగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక (SSMB29 Update) విషయాన్ని వెల్లడించారు.
Read Also: The Girlfriend Movie: ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూ
ఈవెంట్ కోసమూ భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని
క్లైమాక్స్ షూట్ జరుగుతున్నట్లు డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. ఇదే సమయంలో ఈనెల 15న జరగనున్న ‘GlobeTrotter’ ఈవెంట్ కోసమూ భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

‘ఈ ఈవెంట్ వరకు వేచి ఉండలేం. అందుకే ఈ వారాన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నింపుతాం. అందులో భాగంగానే ఇవాళ పృథ్వీరాజ్ లుక్ రిలీజ్ చేస్తాం’ అని ట్వీట్ చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అతని లుక్‌పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మహేశ్ బాబుతో అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: