ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రానికి ‘వారణాసి’ (‘Varanasi’ Movie) అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేస్తూ చిత్రబృందం ముఖ్య వివరాలను వెల్లడించింది.
Read Also: Andhra King Taluka Trailer : రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తలుకా’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
ఆయన కథ చెప్పిన విధానానికి ఫిదా అయ్యాను
రాజమౌళి సినిమా అంటే గ్లోబల్ స్థాయిలో అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందులో మహేశ్ బాబు మొదటిసారి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టైటిల్ రివీల్‌తో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran).. మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘‘నేను చూసిన మొదటి తెలుగు సినిమా మహేశ్ ‘పోకిరి’. ‘వారణాసి’ కథకు, అందులోని పాత్రకు మహేశ్ బాబు (Mahesh Babu) అర్హుడు. రాజమౌళి గారు ఈ సినిమాలోని నా పాత్ర గురించి ఐదు నిమిషాలు చెప్పగానే వెంటనే అంగీకరించాను. ఆయన కథ చెప్పిన విధానానికి ఫిదా అయ్యాను.ఈ చిత్రంలో నా ‘కుంభ’ పాత్ర శారీరకంగా, మానసికంగా నాకు ఒక పెద్ద సవాల్‌గా నిలిచింది. షూటింగ్‌లో నేను నిజంగా టార్చర్ అనుభవించాను’’ అని నవ్వుతూ (Prithviraj Sukumaran) అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: