టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘SSMB29’. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ రంగంలోనూ కొత్త పేజీని తెరవబోతోందని అంచనాలు ఉన్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రాజమౌళి, ఈసారి గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ జోనర్‌లో మరో అద్భుతాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.
Read Also: Peddi Movie: ‘చికిరి చికిరి’ పాట విడుదల
ఇప్పటివరకు మహేశ్ బాబు ఎప్పుడు కనిపించని విధంగా సాహసాలు, ప్రయాణాలు, హ్యూమన్ ఎమోషన్‌ని తట్టిలేపే అంశాలతో కూడిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ( Prithviraj Sukumaran) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ‘SSMB29’లో పృథ్వీరాజ్ ( Prithviraj Sukumaran) పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని రాజమౌళి రివీల్ చేశారు. పోస్టర్‌లో ఆయన ‘కుంభ’ అనే పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించారు. ‘‘ఫస్ట్ షాట్ తీసిన వెంటనే పృథ్వీ దగ్గరికి వెళ్లి.. నేను చూసిన అత్యంత గొప్ప నటుల్లో నువ్వు ఒకరు అని చెప్పాను.
ఈ లుక్ చూస్తుంటే
ఈ దుర్మార్గుడైన, నిర్దాక్షిణ్యమైన, శక్తివంతమైన ప్రతినాయకుడు ‘కుంభ’ పాత్రకు జీవం పోయించడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ కుర్చీలో అక్షరాలా నువ్వు జారిపోయి ఆ పాత్రలో కలిసిపోయినందుకు ధన్యవాదాలు పృథ్వీ’ అంటూ రాసుకొచ్చారు. పోస్టర్‌లో పృథ్వీరాజ్ ఒక వీల్‌చైర్‌లో కూర్చొని ఉండగా వెనుకభాగంలో రోబోటిక్ ఆర్మ్ సపోర్ట్ (Robotic arm support) ఉన్నట్లు చూపించడం ప్రత్యేకంగా నిలిచింది.
ఈ లుక్ చూస్తుంటే ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (Stephen Hawking) స్టైల్‌కు దగ్గరగా డిజైన్ చేసిన పాత్ర అని అర్థమవుతోంది. ఆ పాత్ర శారీరకంగా బలహీనంగా కనిపించిగా.. బుద్ధి, వ్యూహం అనే శక్తులతో ప్రపంచ వినాశనానికి ప్రయత్నించేలా కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టెన్షన్, డార్క్ ఫీల్, ఇంటెన్సిటీ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: