📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pratyusha: కోర్టు తీర్పుపై స్పందించిన ప్రత్యూష తల్లి

Author Icon By Saritha
Updated: February 17, 2026 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pratyusha: కూతురు మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కానీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని సినీ నటి ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆమె స్పందిస్తూ, అతనికి సరైన శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Prathyusha death case: ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి లభించని ఊరట!

Pratyusha: Pratyusha’s mother reacts to the court verdict

తన కూతురు మృతి చెందిన సమయంలో తమకు బెదిరింపులు వచ్చాయని, కానీ ధైర్యంగా న్యాయస్థానంలో పోరాడామని అన్నారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను చంపేశారని ఆరోపించారు. న్యాయం కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నానని అన్నారు. ఉన్నతస్థానానికి చేరుకోవాల్సిన తన కూతురు జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు సిద్ధార్థరెడ్డి విదేశాల్లో ఉన్నాడని తెలిసిందని అన్నారు.

ఈ కేసును మొదట్లోనే అంతా తారుమారు చేశారని ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికను కూడా ఆమె తప్పుబట్టారు. కానీ కొన్ని సాక్ష్యాలను సేకరించి పోరాటం ప్రారంభించానని అన్నారు. అప్పుడే సాక్ష్యాలు అన్నీ ఉండి ఉంటే నిందితులకు జీవితకాల శిక్ష తప్పకుండా పడేదని అన్నారు. కన్నతల్లిగా తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పక్కన పెట్టారని ఆరోపించారు. 24 ఏళ్లుగా ఒంటరిగా పోరాడుతూ నరకం అనుభవిస్తున్నానని, తమకూ ఎవరూ తోడుగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

actress Pratyusha death Latest News in Telugu Pratyusha suicide case Sarojini Devi Siddhartha Reddy Supreme Court Verdict Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.