Prakash Raj: బాలీవుడ్‌లో ఎనర్జీకి ప్రతీకగా నిలిచిన స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్ 2’ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ ది రివెంజ్’ ను దక్షిణాది స్టార్ హీరోలు ప్రశంసించడంపై పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు ప్రకాశ్ రాజ్. ఈ ప్రశంసల వెనుక ఉన్నది నిజమైన అభిమానమేనా, లేక ఇతర ‘బాధ్యతలు’ కూడా ఉన్నాయా? అనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు.
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి పలువురు దక్షిణాది అగ్ర తారలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.
Read Also: Guvvala Cheruvu Ghat Web Series First Look: ‘గువ్వల చెరువు ఘాట్’ నుంచి గ్లింప్స్ విడుదల

సౌత్ స్టార్ల ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ కౌంటర్.
సాధారణంగా బాలీవుడ్ సినిమాలపై టాలీవుడ్ హీరోలు స్పందించడం సహజమే అయినా, ఈసారి అందరూ ఒకేసారి స్పందించడంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ దీనిపై స్పందిస్తూ.. సౌత్ స్టార్లు ఇంతగా పొగుడుతున్నారు కానీ, బాలీవుడ్ నుంచి ఒక్కరైనా ఈ సినిమా గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌కు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ తన కామెంట్‌లో ఈ ‘బాధ్యతల’ సంకేతాలు దక్షిణాదికి కూడా పాకుతున్నాయి.. #జస్ట్ఆస్కింగ్” అంటూ పరోక్షంగా చురకలు అంటించారు. అంటే ఈ ప్రశంసలు మనస్ఫూర్తిగా వచ్చినవి కావా? వీటి వెనుక ఏవైనా రాజకీయ లేదా వాణిజ్య ఒత్తిళ్లు ఉన్నాయా? అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు..
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: