📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Movie Update: ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ

Author Icon By Anusha
Updated: February 9, 2026 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’పై, సోషల్ మీడియా,లో అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా (Movie Update) నుంచి నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నారని వస్తున్న వార్తలు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో స్వయంగా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఆ పుకార్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తన షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని, వాట్సాప్ ఫ్యాక్టరీలలో కథనాలు అల్లుతున్నారని, మేల్కొని తమ పని తాము చూసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.

Read Also: Tarun Bhaskar: ‘గాయపడ్డ సింహం’ ట్రైజర్ లో హైలైట్స్ ఇవే!

మార్చి 5న విడుదల

గతేడాది ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ‘స్పిరిట్ – వన్ బ్యాడ్ హ్యాబిట్’ వీడియోతో ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పోలీసాఫీసర్ గా, ఆయన పైఅధికారిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారనే విషయం ఆడియో టీజర్ తో క్లారిటీ వచ్చేసింది.

ప్రకాష్ రాజ్ వాయిస్ తో ప్రభాస్ పాత్రని పరిచయం చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ‘స్పిరిట్’ చిత్రాన్ని టీసిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ బ్యానర్స్ పై భూషణ్‌ కుమార్, క్రిషన్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Prabhas Prakash raj Sandeep Reddy Vanga Spirit Movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.