📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Pradeep Ranganathan: తమిళనాడులో బాలయ్యకి ఫ్యాన్స్ ఉన్నారు: ప్రదీప్

Author Icon By Aanusha
Updated: October 25, 2025 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Pradeep Ranganathan

నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెరపై కనిపిస్తే ఆ థియేటర్ మొత్తం ఎలక్ట్రిక్ ఎనర్జీతో నిండిపోతుంది. డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్, మాస్ ఎంట్రీ — ఇవన్నీ కలిపి బాలయ్య సినిమాలే ఒక ఫెస్టివల్‌లా మారుతాయి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (SR NTR) గారి వారసుడిగా బాలయ్య సినిమా రంగ ప్రవేశం చేసినప్పుడు చాలామంది ‘నెపోటిజం’ అనే ముద్ర వేసినా, ఆయన తన ప్రతిభతో దానిని చెరిపేశారు. బాలయ్య తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమా ..హీరోయిన్‌ ఎవరంటే?

బాలకృష్ణ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. ఇండస్ట్రీలో పడి లేవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నోసార్లు బాలకృష్ణ పని అయిపోయిందని కామెంట్లు చేసిన వారికి తన సినిమాలతోనే సమాధానం చెప్పారాయన. ఇటీవల కాలంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి,

ఢాకు మహరాజ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకుని తన రేంజ్‌ మరింత పెంచుకున్నారు.65 ఏళ్ల వయసులోనే చిన్న పిల్లాడిలా ఆయన చేసే అల్లరి, ఆ ఎనర్జీ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.భాషలకు అతీతంగా కొన్ని కోట్ల మందిని అభిమానులుగా మార్చుకున్న నందమూరి బాలకృష్ణ ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోలు సైతం ఎంతో అభిమానిస్తారు.

ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 17న థియేటర్లలోకి

తాజాగా లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాలతో తెలుగువాళ్లకి కూడా దగ్గరైన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథ్, మమితా బైజు జంటగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డ్యూడ్’. ‘Dude’ Movie మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకి సంబంధించి తెలుగులోనూ భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.‘నేను బాలయ్య గారిని ఒకసారి తప్పకుండా కలవాలనుకుంటున్నాను. ఆయనలా నేను ఫోన్ ఫ్లిప్ చేయాలనుకుంటున్నాను.

ఆయన ముందు అలా చేయడం నాకొక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. బాలయ్య గారు చేసే యాక్షన్ సీన్స్, ఆ స్లైడ్ షాట్స్, ఫైట్స్ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన సిగ్నేచర్ మూవ్స్ అన్నీ క్లాసిక్స్. ‘అఖండ 2’లో శూలం తిప్పుతూ ఆయన చేసిన ఫైట్ చూసి షాకయ్యా.

సింహ స్వరం ఆయన ఒక్కరికే సొంతం

ఆ పవర్, పంచ్ డైలాగ్స్ మరెవరికీ సాధ్యం కాదు. ఆయన్ని ఏ హీరో కాపీ కొట్టలేరు. స్క్రీన్‌ మీద రాజసం, సింహ స్వరం ఆయన ఒక్కరికే సొంతం. ఆయన్ని చూస్తుంటేనే ప్రత్యేకనమై ఫీలింగ్ వస్తుంది. ఈ మధ్యకాలంలో నేను విన్న పాటల్లో ‘జై బాలయ్య’ సాంగ్ బాగా నచ్చింది.

అందులో ఆయన బాల్‌తో ఆడుకోవడం, షర్ట్స్ ఫ్లిఫ్ చేయడం భలేగా అనిపిస్తుంటుంది. ఇవన్నీ బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరూ చేయలేరు. తమిళనాడు (Tamil Nadu)లో ఆయనకు భారీ క్రేజ్ ఉంది. ఆయన చేసే ఫైట్స్‌కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు’ అని చెప్పుకొచ్చాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Balakrishna latest news Pradeep Ranganathan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.