📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Prabhu Deva: నా సినీ ఎదుగుదలకు చిరంజీవి ఏ కారణం:ప్రభుదేవా

Author Icon By Anusha
Updated: September 29, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సినిమా రంగంలో తన అద్భుత నృత్యకళతో విశేష గుర్తింపు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా (Prabhu Deva) ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో తనకున్న బంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిన్ననాటి నుంచే నృత్యం పట్ల ఆసక్తి కలిగిన ప్రభుదేవా, ఆ ప్రతిభను సినిమా రంగంలో ప్రదర్శించడానికి అవకాశం దొరకడం వెనుక చిరంజీవి ప్రోత్సాహమే ముఖ్య కారణమని పేర్కొన్నారు.

Nani: నాని సినిమాలో విలన్‌గా మలయాళ స్టార్ హీరో?

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోలో నటుడు జగపతిబాబు (Jagapathi Babu) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వేదికపైకి వచ్చిన ప్రభుదేవా, తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొన్న అనుభవాలను, విజ‌య రహస్యాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

“సినిమా ఇండస్ట్రీలో నాకు చిరంజీవి (Chiranjeevi) గారే ఆదర్శం. ఆయన కష్టపడే తీరును చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. ‘అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు’ చిత్రంలోని ‘మెరుపులా’ పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు ఆయన డ్యాన్స్ మూమెంట్స్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రతిభ ఉన్నవారిని ఆయనెప్పుడూ ప్రోత్సహిస్తారు.

Prabhu Deva

రెండేళ్ల క్రితం ఉన్నట్టుండి నటుడు అవుతానని చెప్పడంతో షాక్ అయ్యా

నాకు ఇంత గుర్తింపు రావడానికి ఆయనే కారణం” అని తెలిపారు.అంతేకాకుండా, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా (‘Jagadekaveerudu Athilokasundari’ movie) లోని ‘అబ్బనీ తీయని దెబ్బ’ పాటకు తన తండ్రితో కలిసి పనిచేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. “ఆ సినిమా చేసేటప్పటికి నా వయసు కేవలం 15 ఏళ్లు.

అప్పుడు నాకు స్టెప్పులు నేర్చుకోవడం, నా పని నేను చేసుకోవడం మాత్రమే తెలుసు” అని ప్రభుదేవా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఇక తన కుమారుడు రిషి గురించి మాట్లాడుతూ.. “మా వంశంలో చాలామంది డ్యాన్సర్లు ఉన్నారు. కానీ నా కొడుకు మొదట్లో ఈ రంగంపై ఆసక్తి చూపలేదు.

రెండేళ్ల క్రితం ఉన్నట్టుండి నటుడు అవుతానని చెప్పడంతో షాక్ అయ్యాను. ఈ రంగంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం కాబట్టి, ముందు చదువు పూర్తి చేసి, ఆ తర్వాత సహాయ దర్శకుడిగా అనుభవం సంపాదించమని సలహా ఇచ్చాను” అని వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవిపై ప్రభుదేవా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News chiranjeevi support choreographer actor director dance sensation early career encouragement Indian Film Industry latest news Prabhu Deva Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.