Prabhas: ‘రాజాసాబ్’ రన్ టైం ఎంతంటే?

Read Time:  1 min
Prabhas The Raja Saab
Prabhas The Raja Saab
FONT SIZE
GET APP

టాలీవుడ్‌ డైరెక్టర్‌ మారుతి-గ్లోబల్ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కాంబోలో వస్తోన్న చిత్రం రాజాసాబ్‌ (Raja saab)‌. హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. ఎస్‌ థమన్‌(S. Thaman) మ్యూజికల్‌ ఆల్బమ్‌ నుంచి మరో సాంగ్ వస్తోంది. కాగా ఇప్పుడు రాజాసాబ్‌ రన్‌టైం టాపిక్‌ ఆసక్తికరంగా మారింది.సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

Read Also: Pragati: వేణు స్వామికి కౌంటర్ ఇచ్చిన నటి ప్రగతి

Prabhas: 'రాజాసాబ్' రన్ టైం ఎంతంటే?

ప్రభాస్ సినిమా పై ఆసక్తి

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ డిసెంబర్ 27న హైదరాబాద్‌లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. (Prabhas) ఈ సినిమాకు సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మరోవైపు, ఈ సినిమా రన్ టైమ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం రన్ టైం 183 నిమిషాలు (3 గంటల 3 నిమిషాలు)గా ఉంది. ఇన్ని గంటల పాటు ప్రేక్షకులను దర్శకుడు మారుతి థియేటర్ లో కూర్చోబెట్టగలరా అనేది ఆసక్తికరంగా మారింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న వింటేజ్ స్టైల్ మూవీ కావడంతో, ఫ్యాన్స్ సినిమా కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కొన్ని సినిమాలకు కథానుగుణంగా లాంగ్ రన్‌ టైం ఫిక్స్ చేస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవలి కాలంలో వచ్చిన పుష్ప 2, అవతార్‌ 3, ధురంధర్‌ సినిమాలు ఈ కేటగిరీలోకే వస్తాయి. ఈ సినిమాలు 3 గంటల 20 నిమిషాలు అంతకంటే ఎక్కువ రన్‌టైంతో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.