Prabhas: రేపు రాజాసాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Read Time:  1 min
Prabhas: రేపు రాజాసాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
FONT SIZE
GET APP

ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న కొత్త పాన్ ఇండియా సినిమా ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, హారర్ ఫాంటసీ కలిసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ముగ్గురు కథానాయికలు ఉండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Read Also: Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన ‘రివాల్వర్ రీటా’

‘ది రాజాసాబ్’ మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వివరాలను చిత్ర బృందం ప్రకటించింది. ‘ది రాజాసాబ్’ మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ ను ఈ నెల 27న నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Prabhas: The Raja Saab movie pre-release event is tomorrow
Prabhas: The Raja Saab movie pre-release event is tomorrow

హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం ఎంతో గ్రాండ్ గా ఈ ఈవెంట్ నిర్వహిస్తామని, అన్ని దారులు ఈ అతిపెద్ద వేడుకకే దారితీస్తాయని పేర్కొన్నారు. మాములుగా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లను విడుదలకు రెండు లేదా మూడు రోజుల ముందు నిర్వహించడం మనం చూస్తున్నాం. అయితే ప్రభాస్ (Prabhas) సినిమా ఈవెంట్ ని 13 రోజుల ముందుగానే ప్లాన్ చేస్తుండటం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.