📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Prabhas: ఫిబ్రవరిలో కల్కి-2 షూటింగ్ ప్రారంభం?

Author Icon By Anusha
Updated: December 31, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముందుగా ఆయన నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. రాజా సాబ్ విడుదలైన వెంటనే ప్రభాస్ కల్కి 2 షూటింగ్‌లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతున్నట్లు టాక్. విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లిన చిత్రం గా నిలిచింది.

Read Also: Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు?

ఫిబ్రవరిలో కల్కి-2 షూటింగ్

గతేడాది జూన్‌లో రిలీజైన కల్కి ₹1100 కోట్ల కలెక్షన్లు సాధించింది. మొదటి భాగం ముగిసిన విధానం చూసిన ప్రేక్షకులు రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల నుంచి కల్కి 2 షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ముఖ్యంగా ఈ పార్ట్‌లో కమల్ హాసన్, ప్రభాస్ మధ్య జరిగే యుద్ధం కీలకంగా ఉండబోతుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎపిక్ వార్ సీక్వెన్స్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Prabhas: Kalki-2 shooting to start in February?

దీనికోసం ప్రత్యేకంగా సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్‌పై భారీగా ఖర్చు చేయనున్నారని సమాచారం.ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్, కల్కి 2 ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని స్పిరిట్‌కు కొద్ది రోజుల బ్రేక్ ఇచ్చి, నాగ్ అశ్విన్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం. దీనికి సందీప్ రెడ్డి వంగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.న్యూఇయర్ సందర్భంగా స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రావచ్చని టాక్.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Kalki 2 latest news Prabhas raja saab movie Spirit Movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.