Sujeeth Cinematic Universe: పవన్ కళ్యాణ్ OGతో ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్
Prabhas in OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే అమెరికా సహా అనేక చోట్ల ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. షోలు చూసిన ప్రేక్షకులు “సినిమా అసలు అదిరిపోయింది” అంటూ సోషల్ మీడియాలో రివ్యూలు షేర్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం నెలకొంది. సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యాన్స్ మాత్రమే కాక, సాధారణ ప్రేక్షకులకూ సూపర్‌గా నచ్చిందనే టాక్ వస్తోంది.
Read Also: OG Movie పవన్ కల్యాణ్ మూవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ
సాహో – OG లింక్
ఈ సినిమాకి సాహో సినిమాతో కనెక్షన్ ఉంటుందనే వార్తలు ముందే వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి డివివి సంస్థతో పాటు దర్శకుడు సుజీత్, “Sujeeth Cinematic Universe” ని ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు. నిజంగానే OGలో సాహోకు(sahoo) సంబంధించిన లింక్ కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.
OGలో విలన్ పాత్ర ఓమి (ఇమ్రాన్ హష్మీ) సాహోలో చూపించిన వాజీ సిటీ నుంచే వస్తాడు. అలాగే ప్రభాస్ పోషించిన సిద్ధార్థ్ నందన్ తండ్రి రాయ్ (జాకీ ష్రాఫ్) ను ముంబైలో చంపేందుకు ఓమి ట్రై చేస్తాడనే సన్నివేశం ఉంది. OG కథ కూడా ముంబైలోనే నడుస్తుంది. ఈ విధంగా ఇమ్రాన్ హష్మీ – జాకీ ష్రాఫ్ పాత్రలకు కనెక్ట్ ఇచ్చారు. ఆసక్తికరంగా, OGలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను కూడా చూపించారు.
OG 1980–90 దశకాల్లో జరిగే కథ. సాహో మాత్రం 2019లో సెట్ అయింది. అందువల్ల సుజీత్ ముందుగా తండ్రి కథను OGలో చూపించి, తరువాత సాహోతో లింక్ కలిపాడు. దీంతో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ – ప్రభాస్ ఇద్దరూ ఒకే సినిమాలో స్క్రీన్‌పై కనిపించే ఛాన్సులు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సుజీత్ యూనివర్స్‌లో నాని కూడా!
ఇంతటితో ఆగకుండా, సుజీత్ నానితో చేసే నెక్స్ట్ సినిమా కూడా ఈ యూనివర్స్‌లోకి లింక్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అంటే OGతో మొదలైన ఈ ప్రయాణం, రాబోయే రోజుల్లో Sujeeth Cinematic Universe ని మరింత ఎక్స్‌పాండ్ చేయనుంది.
మొత్తానికి, OGతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రభాస్ అభిమానులు, నాని అభిమానులు కూడా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.
Read Also: