Prabhas: జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై డార్లింగ్ ఫోటో

Read Time:  1 min
Prabhas: జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై డార్లింగ్ ఫోటో
FONT SIZE
GET APP

తెలుగు సినిమా ఇండస్ట్రీలో, రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్, తన కృషి, అంకితభావంతో పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగాడు.కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas) నుంచి సినిమా వస్తుందంటే సినీ లవర్స్‌కి పండగే. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్న ప్రభాస్ మరో అరుదైన ఘనత ముంగిట నిలిచారు. జపాన్‌కు చెందిన ప్రఖ్యాత అనన్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించనున్న తొలి భారతీయ సోలో హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టిస్తున్నారు.

Read Also: With Love Movie: విత్ లవ్ సినిమా ఎలా ఉందంటే!

Prabhas: Darling on the cover of a Japanese magazine
Prabhas: Darling on the cover of a Japanese magazine

ప్రభాస్‌కు సోలోగా గౌరవం దక్కడం విశేషం

ఈ నెల 10న విడుదల కానున్న ఆ మ్యాగజైన్‌లో, ప్రభాస్‌ (Prabhas) కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణను, ముఖ్యంగా జపాన్ ప్రేక్షకుల్లో ఆయనకు ఏర్పడిన అభిమానాన్ని అందులో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల అనంతరం రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆ మ్యాగజైన్ కవర్‌పై కనిపించగా, ఇప్పుడు ప్రభాస్‌కు సోలోగా ఆ గౌరవం దక్కడం విశేషం. ఇప్పటికే ఆ కవర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.