📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Pooja Hegde – దుల్కర్ సల్మాన్‌కు జోడీగా బుట్టబొమ్మ

Author Icon By Anusha
Updated: September 10, 2025 • 8:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్యూటీ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) తెలుగులో కాస్త కాలంగా తెరపై కనిపించలేదు. కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఆమెకు ఇటీవల తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ చిత్రాల్లో మాత్రం ఆమెకు మంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి, కానీ తెలుగులో చేతికి వచ్చే ప్రాజెక్ట్స్ కూడా వేరే కారణాల వల్ల వెనక్కి పోతున్నాయి. ఇలాంటి సమయంలో, ఓ క్రేజీ, పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే అవకాశం పొందారు.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం SLV సినిమాస్ బ్యానర్‌లో రూపొందుతోంది. ఇది దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కెరీర్‌లో 41వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతానికి ఈ సినిమా వర్కింగ్ టైటిల్ #DQ41 అని పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా రోజుల క్రితమే సెట్స్‌పైకి వెళ్లి, సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది.

వర్కింగ్ టైటిల్ #DQ41 అని

చాలా రోజుల క్రితమే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా.. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెకు వెల్కమ్ చెబుతూ ఓ స్పెషల్ వీడియోని పంచుకున్నారు.పూజా హెగ్డే షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలియజేస్తున్న ఈ మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది.

ఇందులో హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. పూజ స్కూటీ నడుపుతుండగా, దుల్కర్ ఆమె వెనుక కూర్చుని ఉన్నారు. ఈ సీన్ వారిద్దరి మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తోంది. ఇద్దరూ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. స్క్రీన్ పై జంట అందంగా కనిపించింది. బ్యాగ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కూడా బాగుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ‘DQ 41’ షూటింగ్ జరుగుతున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.

Latest News

అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనయ్ ఓం గోస్వామి డీవోపీగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రెడీ అవుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/meesha-movie-ott-release-date/cinema/544836/

DQ41 Dulquer Salman Dulquer Salman upcoming project Pan India Movie pooja hegde Pooja Hegde latest film SLV Cinemas Telugu News Tollywood Comeback

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.