📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Rajinikanth: రజనీకాంత్‌ కు, బర్త్‌డే విషెస్‌ తెలిపిన ప్రధాని మోదీ

Author Icon By Anusha
Updated: December 12, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సినీ పరిశ్రమలో స్టైల్‌, స్వాగ్‌కి పర్యాయపదంగా మారిపోయారు సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth). హీరో అంటే ఆరగడుగుల ఎత్తు, కండలు తిరిగిన శరీరం, మంచి రంగు ఉండాల్సిన అవసరం లేదని నిరూపిస్తూ స్టైల్, స్వాగ్, ఆరా, అటిట్యూడ్‌తోనే వెండితెరపై అద్భుతాలు సృష్టించి స్టార్ హీరోగా ఎదిగారాయన. రజినీ వెండితెరపై నడుచుకుంటూ వచ్చే శబ్దానికే థియేటర్లు కదిలిపోతాయి. డైలాగ్ చెప్పే తీరు, సిగరెట్ కాల్చే స్టైల్, ఫైట్స్‌లో చూపించే ఎనర్జీ ఇవన్నీ ఆయనకే ప్రత్యేకం. అందుకే కోట్లాది మంది అభిమానులు ఆయనను కేవలం హీరోగా కాదు అంతకుమించి ఆరాధిస్తారు.

Read Also: Janwar: తల లేని శవం మిస్టరీ: ZEE5లో ‘జానవర్’ సిరీస్.. సస్పెన్స్‌తో సంచలనం!

పుట్టినరోజు శుభాకాంక్షలు

దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు, ఇండియా నుంచి జపాన్ వరకూ రజనీకాంత్ అడుగు పెట్టిన చోటల్లా లక్షలాది మంది అభిమానులు ఆయన్ని చుట్టుముట్టేస్తారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) నేడు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తలైవాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తిరు రజినీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని మోడీ పేర్కొన్నారు. ఆయన నటన తరతరాలను ఆకర్షించిందని ప్రశంసించారు. విస్తృతమైన ప్రశంసలను సంపాదించిందని అన్నారు. రజినీకాంత్ రచనలు విభిన్నమైన పాత్రలను, శైలులను కలిగి ఉన్నాయని స్థిరంగా ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news PM Modi wishes Rajinikanth 75th birthday Telugu News Thalaiva

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.