📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఖరారు..

Author Icon By Tejaswini Y
Updated: February 4, 2026 • 6:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Peddi Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also: Varanasi Movie: ‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ

Peddi Release Date

మార్చి నుంచి ఏప్రిల్‌కు వాయిదా.. ఎందుకంటే?

నిజానికి ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలని చిత్ర యూనిట్ మొదట భావించింది. అయితే, బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న విడుదల కాబోతున్నట్లు ప్రకటన రావడంతో, రామ్ చరణ్ తన సినిమాను వాయిదా వేసుకున్నారు. బాబాయ్, అబ్బాయిల సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఇష్టం లేక ‘పెద్ది’ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఖుషీలో మెగా అభిమానులు

రెండు భారీ చిత్రాల మధ్య సుమారు నెల రోజుల విరామం ఉండటం మెగా అభిమానులకు పెద్ద పండగలా మారింది. మార్చి చివరి వారంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మేనియా కొనసాగితే, ఏప్రిల్ చివరిలో రామ్ చరణ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ గ్యాప్ వల్ల రెండు సినిమాల వసూళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Mega Power Star Pawan Kalyan Ustaad Bhagat Singh Peddi Release Date Ram Charan Peddi movie Ram Charan RC16 Tollywood Movie Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.