మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’: అంచనాలు పెంచుతున్న స్పోర్ట్స్ డ్రామా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi movie). ఈ సినిమా గురించి ఇప్పటికే అనేక ఆసక్తికర విషయాలు వెలువడుతూ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ఒక విభిన్నమైన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం, క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ కథలో, చరణ్ ‘ఆట కూలీ’ అనే ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర ద్వారా రామ్ చరణ్ తన నటనా ప్రతిభను మరోసారి నిరూపించుకోబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ & గ్లింప్స్
ఇప్పటికే విడుదలైన ‘పెద్ది’ (Peddi movie) ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రామ్ చరణ్ (Ram Charan) మాసీవ్ గెటప్ సరికొత్తగా, శక్తివంతంగా కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారాయి. అంతేకాకుండా, ‘ఫస్ట్ షాట్’ (First shot) పేరుతో విడుదలైన మూవీ గ్లింప్స్ ‘పెద్ది’ పై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. చరణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ ట్రీట్ & ఫస్ట్ సాంగ్ రిలీజ్
ఈ సినిమాకు ఆస్కార్ విజేత, సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో ప్రధాన హైలైట్. రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న పాటలు అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని ధీమాగా ఉన్నారు. సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా ఉంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ క్రమంలోనే, ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలోనే విడుదల కానుందని సమాచారం. వినాయక చవితి సందర్భంగా వచ్చే నెల సెప్టెంబర్ 25న ఈ పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ పాట విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ & రిలీజ్ డేట్
‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
పెద్ది మూవీ స్టోరీ?
పెద్ది 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుంది. రామ్ చరణ్ ఒక బలమైన మరియు ఉత్సాహవంతుడైన గ్రామీణుడి పాత్రను పోషిస్తాడు, అతను తన ప్రజలను క్రీడల ద్వారా ఒక శక్తివంతమైన శత్రువుతో పోరాడటానికి ఒకచోట చేర్చుతాడు . జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పెద్ది పాన్ ఇండియా సినిమానా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తన రాబోయే పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌లో ఉన్నారు. ఇటీవలే నిర్మాతలు కీలక సన్నివేశాలను పూర్తి చేశారని, షూటింగ్ శరవేగంగా జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి.
Read Hindi News : hindi.vaartha.com