Peddi movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi) గురించి ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ ఒక ప్రత్యేక గీతంలో (Special Song) మెరవనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ సాంగ్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుందని, దీని కోసం చిత్ర యూనిట్ భారీ సెట్టింగ్స్ సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.
Read Also:Dhurandhar 2 Collections: 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు
Peddi movie Update: జాన్వీ కపూర్‌తో కలిసి స్టెప్పులు!
ఈ స్పెషల్ సాంగ్‌లో మరో విశేషం ఏమిటంటే, ఈ చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ కూడా మృణాల్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే పాటలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయనుండటం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. అయితే, ఈ స్పెషల్ సాంగ్ మరియు కాంబినేషన్ గురించి చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు, మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ (Decoit) అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ‘సీతారామం’ విజయంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మృణాల్, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: