📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Peddi Movie: ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ విడుదల..

Author Icon By Anusha
Updated: July 12, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఉప్పెన’ సినిమాతో డైరెక్ట్‌గా తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నుంచి రానున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ , జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు( జులై 12) సందర్బంగా శనివారం ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది.

సుకుమార్ శిష్యుడైన

ఇందులో ‘ గౌర్నాయుడు ’ పాత్రలో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు శివన్న. ఆ లుక్ చూస్తుంటే ఆయన పాత్ర చాలా శక్తివంతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. పెద్ద మీసం, గంభీరమైన చూపులతో ఆయన లుక్ అదిరిపోయింది. మొత్తానికి బుచ్చిబాబు (Buchi Babu) ‘పెద్ది’ మూవీని గట్టిగానే సెట్ చేశాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. సుకుమార్, రామ్‌చరణ్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి ఘనవిజయం సాధించిందో, సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు, చరణ్‌కి అంతకుమించిన బ్లాక్‌బస్టర్ అందిస్తాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో ‘పెద్ది’ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో రామ్‌చరణ్ కొట్టిన క్రికెట్ షాట్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది. ఎంతో మంది క్రికెటర్లు కూడా ఆ షాట్‌ని మెచ్చుకుని ట్రై చేశారు కూడా.

Peddi Movie: ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ విడుదల..

డూప్ లేకుండా

రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27 ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అఫిషియల్‌గా అనౌన్స్ చేయడంతో షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేలా బుచ్చిబాబు ఏర్పాటు చేసుకుంటున్నాడట. ఈ మూవీలో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ (Hyderabad) లో జరిగిన షెడ్యూల్‌లో దీన్ని చిత్రీకరించారని, చెర్రీ ఎలాంటి డూప్ లేకుండా ఫైట్స్ సీన్స్‌ చేశాడని వార్తలొచ్చాయి. ఈ సీన్ మొత్తం సినిమాకే హైలెట్‌ నిలుస్తుందని యూనిట్ చెబుతోంది. ‘పెద్ది’ మూవీ గురించి రకరకాల వార్తలు బయటికి వస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

‘పెద్ది’ సినిమా నిర్మాత ఎవరు?

‘పెద్ది’ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas) బ్యానర్‌పై రూపొందుతోంది. అలాగే, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి.

‘పెద్ధి’ చిత్రం కథ వ్రాసినవారు ఎవరు?

‘పెద్ధి’ చిత్రానికి, బుచ్చి బాబు సానా రైటర్ గా (Buchi Babu Sana) దర్శకుడిగా కూడా పని చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Pawan Kalyan : పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

AR Rahman music Peddi Breaking News Janhvi Kapoor Telugu Debut Peddi village sports drama Ram Charan Peddi movie Sana Buchibabu direction Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.