📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Peddi Movie: వైరలవుతున్న జగపతిబాబు కొత్త లుక్

Author Icon By Anusha
Updated: February 12, 2026 • 2:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న జగపతి బాబు, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా (Peddi Movie) కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘అప్పల సూరి’ అనే కీలక పాత్ర కోసం ఆయన బరువు తగ్గి, వయసు ముదిరిన వ్యక్తిలా కనిపించేలా ప్రత్యేక మేకోవర్ తీసుకున్నారు. ఆయన కొత్త రూపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ‘రంగస్థలం’ చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన జగపతి బాబు, మరోసారి ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కానుంది.

Read Also: Suhas: ‘హే భగవాన్’ ట్రైలర్ రిలీజ్

Peddi Movie: Jagapathi Babu’s new look is going viral

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్

జ‌గ‌ప‌తి బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ పిక్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. గ‌తంలో కూడా జ‌గ్గూ భాయ్‌కి సంబంధించిన పిక్ ఒక‌టి షేర్ చేయ‌గా, అది కూడా నెట్టింట వైర‌ల్ అయింది. ఇక జగపతి బాబు గతంలో కూడా పాత్ర కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ‘పెద్ది’ కోసం తీసుకున్న మేకోవర్ మాత్రం మరింత విభిన్నంగా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన, తర్వాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస విజయాలతో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Appala Suri character Jagapathi Babu latest news Peddi Movie ram charan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.