పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ’ సినిమా విడుదలపై చాలా రోజులుగా గందరగోళం నెలకొంది. రిలీజ్ వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) క్లారిటీ ఇచ్చింది. ముందుగా చెప్పినట్టే సెప్టెంబర్ 25న ‘ఓజీ’ థియేటర్లకు రానుందని అధికారికంగా ప్రకటించింది.యాక్షన్‌తో పాటు ఎమోషన్ మిక్స్‌గా తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌కు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇందులో సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ఆయన క్యారెక్టర్ పవర్‌పుల్‌గా ఉండబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ ద్వారా అర్థమైంది. మాస్ ఫ్యాన్స్‌కి ఇది పక్కా ఫాస్ట్అనేలా ఉంది.

వదంతులపై నిర్మాణ సంస్థ ఆగ్రహం
చిత్రం వాయిదా పడుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తీవ్రంగా స్పందించింది. “వేడుకల కోసం సిద్ధంగా ఉండండి. ‘ఓజీ’ను సెప్టెంబర్ 25న విడుదల చేయడం ఖాయం. తప్పుడు వార్తలను నమ్మొద్దు” అని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో అభిమానుల ఉత్కంఠకు చుక్కెదురైంది.ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. మరోవైపు బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మీ పవన్‌కు ప్రతినాయకుడిగా నిలవనున్నారు. ఇది ఆయనకు తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఈ జంట స్క్రీన్‌పై ఎలా చూపిస్తారో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫాన్స్‌కి పండగే పండగ
‘ఓజీ’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పవన్ మాస్ కంటెంట్‌లో మెరవనుండటంతో ఫ్యాన్స్‌కి ఇది పండగలా మారనుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ క్లారిటీతో, అభిమానులంతా సెప్టెంబర్ 25 కోసం వెయిట్ చేస్తున్నారు.
Read Also : Sirish : రామ్ చరణ్‌కు సారీ చెప్పిన నిర్మాత శిరీష్