📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pawan Kalyan: ఈ నెల 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్?

Author Icon By Tejaswini Y
Updated: March 3, 2026 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే ఫస్ట్ కాపీతో సెన్సార్‌కు వెళ్లనుంది.

Read Also:Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి త్రివిక్రమ్ ఎంట్రీ!

Pawan Kalyan: ‘Ustad Bhagat Singh’ pre-release event on the 19th of this month?

నేనంటూ బరిలోకి దూకానా.. మామూలుగా ఉండదు!

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “నేనంటూ రంగంలోకి దిగడం వరకే.. ఒక్కసారి నేను బరిలోకి దూకానా? మామూలుగా ఉండదు. మనల్ని ఎవడ్రా ఆపేది!” అంటూ పవన్ తనదైన శైలిలో హెచ్చరించడం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ డైలాగ్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది.

హైదరాబాద్‌లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

చిత్ర ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకెళ్లేందుకు చిత్రబృందం భారీ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరుకానుండటంతో టాలీవుడ్‌లో ఈ ఈవెంట్ హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Mythri movie makers Pawan Kalyan New Movie Ustaad Bhagat Singh Pre Release Event Ustaad Bhagat Singh Release Date

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.