Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జోరును పెంచారు. ఆయన సినిమాల కోసం చూస్తున్న అభిమానులకు వరుసగా రెండు శుభవార్తలు అందనున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న వెండితెరపై సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Also: Tollywood: తెలుగులో గుర్తింపు కోసం కాయదు లోహర్ రీ-ఎంట్రీ
మార్చి 19న సురేందర్ రెడ్డితో కొత్త ప్రాజెక్ట్
దీంతో పాటు, పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి(Surender Reddy) కాంబినేషన్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త సినిమాకు ముహూర్తం ఖరారైంది. మార్చి 19న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది.
ఏప్రిల్ నుండి షూటింగ్..
ఏప్రిల్ మొదటి వారం నుండి ఈ గ్యాంగ్‌స్టర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: