📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pawan Kalyan: నిజ జీవితంలా తెరపై కనిపించాలనుంది: పవన్

Author Icon By Sharanya
Updated: June 22, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక మానసిక భావోద్వేగాలతో నిండి, జీవితాన్ని చూసే తన దృష్టికోణాన్ని ఎంతో ఆత్మీయంగా తెలియజేశారు.

నటనపై అసంతృప్తి – తెరమీద నా మనసు కనిపించలేదు

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ – “ఇప్పటిదాకా నేను చేసిన ఏ పాత్ర కూడా నా మనసుకు పూర్తిగా దగ్గరవ్వలేదు. ప్రతి పాత్రలోనూ కొన్ని అంశాలు మాత్రమే నాకు నచ్చాయి. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో, తెరపైనా అలాగే కనిపించాలని నా కోరిక. కానీ, సినిమాల్లో అది కుదరకపోవచ్చు. అలాంటి సినిమాకు జనాదరణ లభించదేమో!” అని అన్నారు.

భారతీయ సినిమాల్లో సంస్కృతి పతనం – బాలీవుడ్‌

పవన్ బాలీవుడ్‌పై స్పందిస్తూ ఒకప్పుడు బాలీవుడ్‌లో దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు వచ్చేవని గుర్తుచేశారు. “ప్రస్తుతం ‘దంగల్’ వంటి ప్రభావవంతమైన సినిమాలు రావడం లేదు. ప్రేక్షకుల అభిరుచులకు తగిన కథలను అందించడంలో వారు వెనుకబడుతున్నారేమో!” అని అభిప్రాయపడ్డారు.

రాజకీయాల్లోకి ప్రవేశం – కుటుంబ ప్రభావం & ప్రజాసేవ పట్ల ఆసక్తి

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ- నటన నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి పవన్ వివరిస్తూ, తన తండ్రి తనకు స్ఫూర్తి అని తెలిపారు. “నేను నటుడిని కావాలని గానీ, సినిమాల్లోకి రావాలని గానీ ఎప్పుడూ అనుకోలేదు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, ఆయనకు కమ్యూనిస్టు భావజాలం ఉండేది. ఆయన ప్రభావం వల్లే మా కుటుంబ సభ్యులందరికీ రాజకీయాలపై కొంత అవగాహన ఏర్పడింది. నేను అనుకోకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టినా, నా దృష్టి ఎప్పుడూ సమాజంపైనే ఉండేది. ఆ ఆలోచనల నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించాను” అని పవన్ కల్యాణ్ వివరించారు.

తమిళనాడు పర్యటన – సనాతన ధర్మం పై పవన్ నిబద్ధత

ఇటీవల పవన్ కళ్యాణ్ మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంలో పాల్గొనడం ఆయన సనాతన ధర్మంపై గల నిబద్ధతకు ప్రతీకంగా నిలిచింది.

Read also: Vijay: నటుడు విజయ్ దేవరకొండ పై అట్రాసిటీ కేసు నమోదు

#Janasena #PawanKalyan #PawanKalyanSpeech #PowerStar #TeluguCinema Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.