పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ ఒక భావోద్వేగ భరిత పోస్ట్‌తో అభిమానుల మన్ననలు అందుకున్నారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కావడంతో, ఆయన నటిస్తున్న తాజా చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”కి సంబంధించిన ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
“నా హీరో, నా స్ఫూర్తి” అని చెప్పిన హరీశ్ శంకర్
పవన్ కల్యాణ్‌పై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి హరీశ్ శంకర్ (Harish Shankar) చాటుకున్నారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు.. నా సోదరుడు, నా స్ఫూర్తి, నా హీరో — ఒకే ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్” అంటూ హరీశ్ తన ట్విట్టర్‌లో రాసిన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే, “ఆయన్ను నేను ఇలా చూడాలనుకున్నా.. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అంటూ పవన్ లుక్‌తో కూడిన పోస్టర్‌ను షేర్ చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు
పవన్ కల్యాణ్(Pawan Kalyan), హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఇది రెండో చిత్రం కావడం విశేషం. గతంలో ‘గబ్బర్ సింగ్’ అనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ జంట మళ్లీ స్క్రీన్‌పై మాయ చేయబోతోందన్న నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పవన్ పవర్‌ఫుల్ లుక్‌తో కూడిన తాజా పోస్టర్ చూస్తే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
అభిమానులకు పుట్టినరోజు ట్రీట్
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ అభిమానులకు ఒక ప్రత్యేక కానుకలా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. అభిమానులు తమ అభిమాన హీరోను పక్కా మాస్ గెటప్‌లో చూడడం పట్ల ముచ్చటపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: