📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Palash Muchhal: మహిళా క్రికెటర్ స్మృతి ఫ్రెండ్‌కు హైకోర్టు వార్నింగ్

Author Icon By Anusha
Updated: February 14, 2026 • 10:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్ పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని నటుడు, నిర్మాత విజ్ఞాన్ మానేకు బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.పలాశ్ లేదా అతడి తల్లిని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర, ధ్రువీకరించని ప్రకటనలు చేయరాదని జస్టిస్ మిలింద్ జాదవ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానతో పలాశ్ ముచ్చల్ వివాహం రద్దు కావడం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. స్మృతి స్నేహితుడిగా చెబుతున్న విజ్ఞాన్ మానే.. పలాశ్‌పై ఆర్థిక, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

Read Also: World Radio Day 2026: నేడు వరల్డ్ రేడియో డే

Palash Muchhal: High Court warns Smriti’s friend

తదుపరి విచారణను మార్చి కు వాయిదా

ఒక సినిమా ప్రాజెక్టు కోసం తన వద్ద రూ.40 లక్షలు తీసుకుని పలాశ్ మోసం చేశాడని విజ్ఞాన్ ఆరోపించారు. దీంతోపాటు పెళ్లి రద్దుకు సంబంధించిన వ్యక్తిగత అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగిందని పేర్కొంటూ పలాశ్ ముచ్చల్.. విజ్ఞాన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, ఇరువర్గాల మధ్య ఉన్నది వాణిజ్యపరమైన వివాదమని,

దానికి పెళ్లి రద్దు వంటి వ్యక్తిగత అంశాలను ముడిపెట్టడం సరికాదని ప్రాథమికంగా అభిప్రాయపడింది. విజ్ఞాన్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది.తన ఆరోపణలకు ఆధారాలు సమర్పించేందుకు విజ్ఞాన్‌కు రెండు వారాల గడువు ఇచ్చిన న్యాయస్థానం, తదుపరి విచారణను మార్చి 11, 2026కు వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

bombay high court latest news Palash Muchhal Smriti Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.