📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

OTT: యదార్థ గాథ దెయ్యాల కథ..ఇప్పుడు ఓటీటీలో

Author Icon By Sharanya
Updated: May 15, 2025 • 1:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ సినిమా ముంబైలోని జుహు బీచ్ లో చోటుచేసుకున్న ఓ నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ఒక పాడుబడిన ఓడను జుహు బీచ్ నుండి తరలించే ప్రయత్నంలో జరిగే అనేక భయంకరమైన సంఘటనలు కథాంశంగా ఉంటాయి.

కథ వివరాలు

ఈ హారర్ థ్రిల్లర్ చిత్రంలో కథ ప్రధానంగా ఓడ లో ఉండే దెయ్యం మరియు ఒక చిన్న పాపను బంధించి ఉంచిన మిస్టరీ మీద ఆధారపడుతుంది. వీటికి సంబంధించి జేబోలో ఉన్న భయంకరమైన అనుభవాలు మరియు అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇది రియల్ స్టోరీ ముంబై మహా నగరంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జుహు బీచ్ లో ఒక పాడుబడిన దెయ్యాల నౌకను తరలించే క్రమంలో ఈ సినిమా నడుస్తుంది. ఇందులో హీరో ఒక షిప్పింగ్ అధికారిగా ఉద్యోగం చేస్తుంటాడు. ఇతను తన భార్య, కుమార్తెను కోల్పోయి మానిసిక క్షోభ అనుభవిస్తుంటాడు. తన విధుల్లో భాగంగా ముంబైలోని జుహు బీచ్‌లోకి కొట్టుకొచ్చిన ‘సీ బర్డ్’ అనే ఓ పాడుబడిన ఓడ గురించి తెలుసుకుంటాడు. ఈ ఓడలో ఎవరూ ఉండరు. కానీ అక్కడకు వెళ్లిన వారు తిరిగి రావడం లేదన్న విషయాన్ని తెలుసుకుంటాడు. దీంతో హీరో తన స్నేహితులతో కలిసి ఓడలోని మిస్టరీని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే నౌకలో హీరోకు అనేక భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. అదే సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఓడలో ఉండే దెయ్యం, ఒక చిన్న పాపను బంధించి ఉంచిందని హీరో తెలుసుకుంటాడు. అలాగే ఈ దెయ్యంకు, గతంలో ఓడలో జరిగిన ఓ విషాదకర ఘటనకు సంబంధం ఉందని తెలుసుకుంటాడు. మరి ఆ ఓడలో దాగున్న మిస్టరీ ఏంటి? అసలు ఆ ఓడలోకి దెయ్యాలు, ఆత్మలు ఎలా వచ్చాయి? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘భూత్ : ది హాంటెడ్ షిప్’. 2020 ఫిబ్రవరి 21న థియేటర్లో విడుదలైన ఈ బాలీవుడ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను బాగా భయ పెట్టింది.

పాత్రలు, నటన, మరియు నిర్మాణం

భాను ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్, మరియు ఆశుతోష్ రానా ప్రధాన పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్, హిరూ యష్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

స్ట్రీమింగ్ వివరాలు

ఈ భూత్: ది హాంటెడ్ షిప్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ బాలీవుడ్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Read also: Meenakshi Chowdhury: చీరలో మైమరిపిస్తున్న మీనూ

#BhutTheHauntedShip #HauntedShip #HorrorThriller #OTTMovies #OTTStreaming #RealLifeHorror #RealStoryBased #SuspenseMovies #SuspenseThriller Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.