OTT Deals 2026: ఇప్పుడు ఓటీటీదే హవా! టాప్-5 క్రేజీ డీల్స్ ఇవే

Read Time:  1 min
OTT Deals 2026: ఇప్పుడు ఓటీటీదే హవా! టాప్-5 క్రేజీ డీల్స్ ఇవే
FONT SIZE
GET APP

OTT Deals 2026: ఒకప్పుడు సినిమా సక్సెస్ అంటే కేవలం థియేటర్ల వద్ద వచ్చే వసూళ్లే. కానీ ఇప్పుడు డిజిటల్ హక్కుల ద్వారానే సగం బడ్జెట్ వెనక్కి వస్తోంది. టాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తున్న సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ టాప్ డీల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:

Read Also: Avatar 3 Oscar: అవతార్ 3 కి ఆస్కార్ అవార్డు: భారతీయ సినీ అభిమానుల ఆగ్రహం!

1. వారణాసి

ఎస్‌.ఎస్‌. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ అడ్వెంచర్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. సుమారు రూ. 1361 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 650 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓటీటీ డీల్ కానుంది.

OTT Deals 2026: OTT is the trend now! These are the top 5 crazy deals
OTT Deals 2026: OTT is the trend now! These are the top 5 crazy deals

2. అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ నాన్-థియేట్రికల్ బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 600 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

3. కల్కి 2898 ఏడీ

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లు సాధించింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు రూ. 375 కోట్లకు కొనుగోలు చేసింది.

4. RRR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ గ్లోబల్ హిట్ సినిమా ఓటీటీ బిజినెస్‌లో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం రూ. 300 కోట్లు వెచ్చించింది.

5. స్పిరిట్, డ్రాగన్ & పెద్ది

ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న మరికొన్ని క్రేజీ సినిమాలు కూడా వంద కోట్ల మార్కును సులువుగా దాటేశాయి:

  1. స్పిరిట్: ప్రభాస్ – సందీప్ వంగా మూవీ రూ. 160 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.
  2. డ్రాగన్: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ దాదాపు రూ. 140 కోట్లకు అమ్ముడైంది.
  3. పెద్ది: రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ రైట్స్ రూ. 115 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
  4. ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ మూవీ ఓటీటీ హక్కులు రూ. 80 కోట్లకు క్లోజ్ అయినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.