📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: OTT – ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: September 19, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనూహ్యంగా వచ్చిన ఒక యానిమేషన్‌ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర సంచలనాన్ని సృష్టించడం చాలా అరుదు. కానీ ‘మహావతార్‌ నరసింహ’ (‘Mahavatar Narasimha’) మాత్రం ఈ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎలాంటి హైప్‌ లేకుండా విడుదలైన ఈ చిత్రం, కేవలం కంటెంట్‌, సాంకేతిక నాణ్యత, కథనం మీదే ఆధారపడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. థియేటర్లలో మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయిన ఈ యానిమేటెడ్ మూవీ, బడ్జెట్‌తో పోలిస్తే అసాధారణమైన వసూళ్లను రాబట్టింది.

సమాచారం ప్రకారం, సుమారు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ‘మహావతార్‌ నరసింహ’, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.320 కోట్ల కలెక్షన్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఈ విజయం యానిమేషన్ (Animation movie) రంగానికి కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని సినీ పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది

రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 320 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది.‘మహావతార్‌ నరసింహ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

OTT

సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ యానిమేషన్ మూవీకి స్మాల్ స్క్రీన్స్ పైనా మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని వారాల పాటు నెట్ ఫ్లిక్స్ (Netflix) టాప్ ట్రెండ్స్ ఉండే అవకాశం ఉంది.నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్ భాగవత పురాణం ఆధారంగా ‘మహావతార్ నరసింహ’ సినిమా తెరకెక్కింది.

హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో మొదటి చిత్రంగా డైరెక్టర్ అశ్విన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. జయపూర్ణ దాస్ స్టోరీ రాశారు. సామ్ సీఎస్ సంగీతం సమకూర్చారు. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ విడుదల చేశారు.‘మహావతార్‌ నరసింహ’ చిత్రం జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో 50 రోజులకుపైగా ప్రదర్శించబడింది.

బాక్సాఫీస్ దగ్గర రూ. 320 కోట్లు కలెక్ట్ చేసి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ యానిమేషన్‌ మూవీ (Indian animation movie) గా రికార్డ్ క్రియేట్ చేసింది. థియేట్రికల్ రిలీజైన ఏడు వారాలకు ఓటీటీలోకి వచ్చింది. ఇకపోతే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో మహావతార్ పరశురామ్, మహావతార్ రఘునందన్, మహావతార్ ద్వారకాధీష్, మహావతార్ గోకులానంద, మహావతార్ కల్కి పార్ట్ 1, మహావతార్ కల్కి పార్ట్ 2 సినిమాలు రాబోతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/kantara-chapter-1-do-you-know-the-release/cinema/550330/

320 crore worldwide collection 40 crore budget biggest blockbuster animation movie Box Office Success Breaking News latest news Mahavatar Narasimha OTT Release Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.