📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Oscars 2026 Winners List: ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

Author Icon By Anusha
Updated: March 16, 2026 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Oscars 2026 Winners List: ప్రపంచ సినీ వేదికపై అత్యున్నత పురస్కారాలైన ఆస్కార్ అవార్డుల (98th Academy Awards) వేడుక కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం నేడు (మార్చి 16, 2026) తెల్లవారుజామున ప్రారంభమైన ఈ వేడుకలో ప్రపంచవ్యాప్త సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రముఖ అమెరికన్ కమేడియన్ కానన్ ఓబ్రియాన్ వరుసగా రెండో ఏడాది వ్యాఖ్యాతగా వ్యవహరించి, తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు.

Read Also: Prabhas Fauji Teaser Update:ఫౌజీ’మూవీ క్రేజీ అప్‌డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే!!

మైఖేల్ బీ జోర్డాన్, జెస్సీ బుక్లే హవా

ఇక ఉత్తమ నటుడి కేటగిరీలో స్టార్ హీరో మైఖేల్ బీ జోర్డాన్ విజయం సాధించారు. “సిన్నర్స్” చిత్రంలో ఆయన చేసిన అద్భుత నటనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. మిస్సిసిప్పి నేపథ్యంగా తెరకెక్కిన ఈ సూపర్ నేచురల్ చిత్రంలో జోర్డాన్ స్మోక్, స్టాక్ అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.ఈ అవార్డుతో ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్న ఆరో నల్లజాతి నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ నిలిచారు.

Oscars 2026 Winners List: Michael B. Jordan makes history as Best Actor

గతంలో సిడ్నీ పోయిటియర్, డెంజెల్ వాషింగ్టన్, జామీ ఫాక్స్, ఫారెస్ట్ విటేకర్, విల్ స్మిత్ వంటి ప్రముఖ నటులు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ఉత్తమ నటిగా జెస్సీ బుక్లే కి హమ్నెట్ చిత్రానికి గాను అవార్డ్ ద‌క్కింది. ఇక వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ మూవీకిగానూ పాల్‌ థామస్‌ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ని సొంతం చేస్తున్నారు. అంతేకాదు ఇదే మూవీ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది.

98వ అకాడమీ అవార్డుల పూర్తి జాబితా

ఉత్తమ చిత్రం: వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

ఉత్తమ నటుడు: మైఖేల్‌ బి జోర్డన్‌ (సిన్సర్స్)

ఉత్తమ నటి: జెస్సీ బుక్లే (హమ్నెట్‌)

ఉత్తమ దర్శకుడు: పాల్‌ థామస్‌ అండర్సన్‌(వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

ఉత్తమ సహాయ నటుడు: ఈన్‌ పెన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్‌(వెపన్స్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్‌ డురాల్డ్ అర్కపా(సిన్నర్స్)

ఉత్తమ ఎడిటింగ్‌: యాండీ జుర్గెన్‌ సన్‌(వన్‌ బ్యాటిల్‌ అఫ్టర్‌ అనదర్‌ )

ఉత్తమ సంగీతం: లుడ్విగ్‌ గోరాన్సన్‌(సిన్నర్స్)

ఉత్తమ సౌండ్‌ : ఎఫ్‌ 1

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్: అవతార్‌ ఫైర్‌ అండ్‌ యాష్‌

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌: సిన్నర్స్

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ : గోల్డెన్‌ ఫ్రమ్‌ కేపాప్‌ డీమాన్‌ హంటర్స్

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: ర్యాన్‌ కూగ్లర్‌ (సిన్నర్స్)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: పాల్‌ థామస్‌ అండర్సన్‌(వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

ఉత్తమ క్యాస్టింగ్‌ : వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ఫ్రాంకిన్‌ స్టన్‌

ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టయిలింగ్‌: ఫ్రాంకిన్‌ స్టన్‌

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: తమర డేవెరల్‌, షేన్‌ వ్యూ(ఫ్రాంకిన్‌ స్టన్‌)

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్: సెంటిమెంటల్‌ వ్యాల్యూ(నార్వే)

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్: కె‌పాస్‌ డెమన్‌ హంట్స్

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్‌ పెరల్స్

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్‌ ఎక్స్జేంచ్‌ సలైవా

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్: మిస్టర్‌ నోబడీ ఎగనెస్ట్ పుతిన్‌

ఉత్తమ డాక్యుమెంటరీ ఆర్ట్ ఫిల్మ్: ఆల్‌ ది ఎంప్టీ రూమ్స్

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

98th Academy Awards Highlights Jessie Buckley Best Actress Hamnet Michael B Jordan Oscar Sinners Oscars 2026 Winners List

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.