📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

ఓటిటిలోకి రానున్న ఆస్కార్ మూవీస్. ఎప్పుడంటే?

Author Icon By Divya Vani M
Updated: February 3, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్రాంతి సందర్భంగా రిలీజైన సినిమాలన్నీ మంచి కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక, ఫిబ్రవరిలో కూడా పెద్ద సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం, నాగ చైతన్య, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి.ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో పలు ఆసక్తికర సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతాయి. ముఖ్యంగా, నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించిన “తండేల్” సినిమాపై అందరి దృష్టి ఉంది.

అలాగే, అజిత్, త్రిష నటించిన “పట్టుదల” మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక పథకం ప్రకారం” కూడా ఈ వారం థియేటర్లలో విడుదలవుతుంది. మరోవైపు, ఓటీటీలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు రానున్నాయి. ముఖ్యంగా, బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నిర్మించిన “అనూజా” ఒక శార్ట్ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకార్మికుల పోరాటాన్ని ప్రతిబింబించే ఈ షార్ట్ ఫిల్మ్ 97వ ఆస్కార్ నామినేషన్లలో ‘లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్’ విభాగంలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తోంది.ఇంకా, “కోబలి” అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ వెబ్ సిరీస్ పోస్టర్స్, ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. హిందీ, ఇంగ్లిష్ ఇతర భాషల్లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

ఫిబ్రవరి మొదటి వారంలో స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమాలు:నెట్‌ఫ్లిక్స్ – అనూజా (హిందీ సినిమా) – ఫిబ్రవరి 5 – సెలబ్రిటీ బేర్ హంట్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 5 – ప్రిజన్ సెల్ 211 (హాలీవుడ్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 5 – ది ఆర్ మర్డర్స్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 6

అమెజాన్; ప్రైమ్ వీడియో- ది మెహతా బాయ్స్ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 7

డిస్నీప్లస్; హాట్‌స్టార్ – కోబలి (తెలుగు వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 4

సోనీలివ్ ; బడా నామ్ కరేంగే (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 7

జీ 5 ; మిసెస్ (హిందీ సినిమా) – ఫిబ్రవరి 7

ఈటీవీ విన్ ఈ నెలలో ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్’ పలు తెలుగు సినిమాలను స్ట్రీమింగ్‌కు తీసుకురానుంది. “అలా మొదలైంది”, “అతడు”, “బేవార్స్”, “బిచ్చగాడు”, “బ్లఫ్ మాస్టర్”, “బాడీ గార్డ్”, “క్రేజీ ఫెలో”, “ఫిదా”, “మోసగాళ్లకు మోసగాడు”, “పాండురంగడు”, “సింహా”, “తర్వాత ఎవరు”, “వాన” వంటి ఎవర్‌గ్రీన్ మూవీస్ కూడా ఈ వారం ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి.ఈలా ఫిబ్రవరి ప్రారంభంలో తెలుగు ప్రేక్షకులకు పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వస్తున్నాయి, వీటి ద్వారా మరింత టెన్షన్‌ ఫ్రీ ఎంటర్‌టైన్మెంట్ అందిస్తోంది.

Ajith Movies 2025 February 2025 Movies Nag Chaitanya Movies Puri Jagannadh Tandle Movie Telugu Web Series Tollywood Movies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.