Oosaravelli Re Release: మే 20న ‘ఊసరవెల్లి’ రీరిలీజ్

Read Time:  1 min
Oosaravelli Re Release: మే 20న ‘ఊసరవెల్లి’ రీరిలీజ్
FONT SIZE
GET APP

Oosaravelli Re Release: టాలీవుడ్ మాస్ కా బాప్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఊసరవెల్లి’ని మళ్ళీ థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Read Also:Ustaad Bhagat Singh Movie Review: పవన్ మాస్ జాతర.. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

Oosaravelli Re Release: ‘Oosaravelli’ to be re-released on May 20th
Oosaravelli Re Release: ‘Oosaravelli’ to be re-released on May 20th

ఫ్యాన్ ఫేవరెట్‌గా నిలిచిన ‘ఊసరవెల్లి’

2011లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఊసరవెల్లి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, కాలక్రమేణా ఎన్టీఆర్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా ఎన్టీఆర్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టరైజేషన్, సురేందర్ రెడ్డి టేకింగ్, మరియు దేవి శ్రీ ప్రసాద్ అందించిన అదిరిపోయే సాంగ్స్ ఈ సినిమాను ఫ్యాన్ ఫేవరెట్‌గా మార్చాయి.

మే 20న థియేటర్లలో రచ్చ

తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారు. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ సినిమాను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మే 20న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున రీ-రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.