📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: OG Movie: ఓజీ విడుదల.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్టు

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాస్ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం ‘ఓజీ’ (OG Movie) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఫ్యాన్స్ నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ సినిమా రిలీజ్‌ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రిలీజ్‌కి ముందు రోజే ప్రీమియర్ షోలు వేయగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమా కథనాన్ని దర్శకుడు సుజీత్ (Sujeet) స్మార్ట్‌గా తెరకెక్కించారు.

కథ, సంగీతం, యాక్షన్ సన్నివేశాల సమన్వయం ప్రేక్షకులను తెరపై కట్టుబెట్టడం ముఖ్యంగా నిలిచింది. పవన్ కల్యాణ్ మాస్ లుక్ లో తన పాత్రలోని భావోద్వేగాలు, ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేస్తున్నాయి. ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికలో సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటూ, దర్శకుడు, హీరో, టెక్నీషియన్ల కృషిని ప్రశంసిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. “They Call Him OG మీ ముందుకు వచ్చింది.

ఖాతాలో భావోద్వేగభరిత పోస్ట్ చేశారు

ఎన్నో సంవత్సరాల ప్రయాణం చివరకు పూర్తైంది. ఉత్సాహంతో పాటు కొంత బాధ కూడా ఉంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నా డైరెక్షన్, టెక్నీషియన్ టీంకి ‘ఐ లవ్ యూ’! ఇంకా ఎంత చెప్పినా తక్కువే. నన్ను నమ్మిన మా నిర్మాతలు దానయ్య, కల్యాణ్ దాసరి, సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డ తమన్ అన్నకి థ్యాంక్స్.

సినిమాటోగ్రాఫర్ నవీన్ నూలి (Naveen Nooli) బ్రో.. నీ మ్యాజిక్ తెరపై ఆడియన్స్ చూసే క్షణాన్ని నేను కూడా ఎదురుచూస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, మ్యాడ్‌నెస్ ఊహించలేనిది! ఇది కేవలం ఆరంభం మాత్రమే. అన్నీ బాగుంటే ‘ఓజీ’ ఇంకా పెద్దదిగా మారుతుంది. లవ్ యూ మై పవర్ స్టార్‌” అంటూ రాసుకొచ్చారు.

Prabhas in OG: OG లో ప్రభాస్ ఇదికదా కావాల్సింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే

రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల వద్ద పవన్ అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి, బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ‘పవన్ ఈజ్ బ్యాక్’ (‘Pawan is back’) అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. స్టైలిష్ స్క్రీన్‌ప్లే, పవర్‌ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే నేపథ్య సంగీతంతో ‘ఓజీ’ చిత్రం మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తొలిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Audience Response Breaking News Gangster story latest news Mass Appeal OG Movie Pawan Kalyan Sujeeth director Telugu cinema Telugu News theatrical release

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.