తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG సినిమా (OG Movie) మరో ఐదు రోజులలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనాయి, ,ఆన్‌లైన్ టికెట్లు వేగంగా సొల్డ్ అవుతున్నాయి. ఈ క్రమంలో థియేటర్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సినిమా విడుదలకు ముందు ఎదురుచూస్తున్న ఉత్సాహం, అభిమానుల అంచనాలను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.
ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో కనిపిస్తుండటం, టాలీవుడ్‌లోని సినీ అభిమానులను OG ఫీవర్‌లో ముంచేస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు, ఇతర సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) కూడా ఈ మూవీపై తన ఉత్సాహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ఆయన పేర్కొన్నట్లుగా, “ఓజీ హైప్‌కి హెల్త్ అప్‌సెట్ అయ్యేలా ఉంది.
ఇదొక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీ
25వ తేదీ వరకు మేము అగోచరం అవుతున్నాం. ఇప్పుడే ఇలా ఉంటే, 25వ తేదీ తర్వాత పరిస్థితి ఏమిటో ఊహించలేము” అని తెలిపారు.సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండని సిద్ధు జొన్నలగడ్డ.. ఈ మధ్యనే ట్విట్టర్ ఎక్స్ (X) లో అకౌంట్ ఓపెన్ చేశారు. రోజుకొక పోస్ట్ పెడుతూ నెట్టింట యాక్టీవ్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు OG సినిమా కోసం తాను ఎంత ఉత్సాహంగా ఎదురు చేస్తున్నారనేది తెలిపారు. మరోవైపు ప్రస్తుతం అతను నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రాన్ని కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు.
అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ (Sitara Entertainments Banner) లో రూపొందుతున్న ‘బ్యాడాస్’ మూవీకి క్యాస్టింగ్ కాల్ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. (ఓజీ ప్రీమియర్స్.. ‘పుష్ప 2’తో సమానంగా టికెట్ రేట్స్ హైక్)ఇక ‘ఓజీ’ విషయానికొస్తే.. ఇదొక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీ. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు. డైరెక్టర్ సుజీత్ తన ఫేవరేట్ హీరోని మునుపెన్నడూ చూడని విధంగా స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 21న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు ఓజాస్ గంభీర కథ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: