టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి ఉన్న క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్‌స్టార్ తాజా చిత్రం ‘ఓజీ’. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎంటర్టైన్‌మెంట్ కలబోతగా రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నిర్మాత దాసరి వీర వెంకట దానయ్య ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తూ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తేనే ‘ఓజీ’ (OG) పై ఉన్న హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ కొత్త లుక్, గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పవన్‌ని ఇంత స్టైలిష్‌గా ఎప్పుడూ చూడలేదని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్ పూర్తవడంతో యూనిట్‌తో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా
ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నటిస్తున్నది ప్రియాంక మోహన్. ఆమె అందం, పవన్‌తో కెమిస్ట్రీ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. మరో వైపు బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటించటం ఈ సినిమాకి హైలైట్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులను ఆయన పలకరించబోతున్నారు. అలాగే శ్రియా రెడ్డి, వెన్నెల కిషోర్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతి పాత్ర కూడా కథలో బలమైన ఇంపాక్ట్ కలిగించేలా డిజైన్ చేశారని సమాచారం.
సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్లు (Promotions) పెంచారు. ఇప్పటికే రెండు సింగిల్ సాంగ్స్ రిలీజ్ చేయగా తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి బ్లాక్‌బస్టర్ సాంగ్‌ని సోమవారం (సెప్టెంబర్ 15) సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. గన్స్ అండ్ రోజెస్‌తో అత్యంత క్రూరంగా, ప్రేమగా ఈ సాంగ్ ఉండబోతోందని హింట్ ఇచ్చింది.
లక్షల సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడుపోయాయంటేనే క్రేజ్
ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు గూస్‌బంప్స్ తెప్పిస్తోందని, రేపటివరకు ఆగలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరకొచ్చే కొద్దీ ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మరి ఈ అంచనాలను సుజీత్ (Sujeet) అందుకుంటాడా.. లేదా అన్న తెలియాలంటే మరో 11 రోజులు ఆగాల్సిందే.‘ఓజీ’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో టిక్కెట్లు సేల్ అవుతున్నాయి.
నార్త్ అమెరికాలో అప్పుడే లక్షల సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడుపోయాయంటేనే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కి పండగేనని అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: