విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ సినిమాల్లో ‘నువ్వు నాకు వచ్చావ్’ (Nuvvu Naaku Nachav Movie) ఒకటి. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ – కథనం, సంభాషణలతో రూపొందిన చిత్రమిది. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడీ సినిమా (Nuvvu Naaku Nachav Movie) మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యింది.
Read Also: Kajol: ‘స్పిరిట్’లో కాజోల్?
జనవరి 01న రీ రిలీజ్
ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు 4K క్వాలిటీతో తిరిగి థియేటర్లలోకి రాబోతోంది. వెంకటేష్, త్రివిక్రమ్ అభిమానులందరికీ ఇది కొత్త సంవత్సరం పండుగ కానుంది. ఈ సందర్భంగా ‘నువ్వు నాకు నచ్చావ్’ 4K రీ-రిలీజ్ తేదీని చిత్ర నిర్మాణ సంస్థ ఖరారు చేసింది.
న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను జనవరి 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ రీ-రిలీజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఆస్ట్రేలియా, యూరప్, యూకే వంటి దేశాల్లో కూడా రీ రిలీజ్ కాబోతుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: