NTR Prashanth Neel Movie Title: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు మొదట ‘డ్రాగన్’ అనే పేరును పరిశీలించినట్లు ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా ‘బ్రూస్లీ’ అనే టైటిల్ ఖరారైనట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Read Also: Rajamouli-Mahesh Babu: వారణాసిలో కిచ్చా సుదీప్?
అభిమానుల్లో ఆందోళన.. చిత్ర యూనిట్ ధీమా
అయితే ఈ టైటిల్ వార్తలపై నందమూరి అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్లీ: ది ఫైటర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, అదే పేరును ఎన్టీఆర్ సినిమాకు పెట్టవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ, ఈ టైటిల్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా క్రేజ్‌ను పెంచేందుకు ఈ పేరు దోహదపడుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: