📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

NTR: నాటు నాటుతో హీరో ల మధ్య సరదా సవాళ్లు

Author Icon By Sharanya
Updated: August 7, 2025 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘వార్ 2’ సినిమా ప్రమోషన్లలో స్టార్ హీరోలు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ (NTR) చూపిస్తున్న క్రియేటివిటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పాపులర్ ఇంటర్వ్యూలు, ప్రమోషన్ ఈవెంట్లకు భిన్నంగా వీరిద్దరూ వినూత్నంగా బిల్‌బోర్డు సవాళ్లతో ప్రచారం సాగిస్తున్నారు.

ఎన్టీఆర్ స్టెప్పింగ్ మొదటి సవాల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తన పాత్ర స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఓ భారీ బిల్బోర్డును హృతిక్ ఇంటికి పంపించారు. ఆ బోర్డుపై “ఘుంగ్రూ టూట్ జాయేంగే పర్ హమ్‌సే యే వార్ జీత్ నహీ పావోగే” అనేవాక్యం చూపించి, హృతిక్‌కు సరదా గానూ, సవాలుగా గానూ సందేశం పంపారు.

హృతిక్ కౌంటర్: నాటు నాటు కు ఘుంగ్రూ రిప్లై

ఎన్టీఆర్ సవాలుకు హృతిక్ రోషన్ (Hrithik Roshan) కూడా దీటుగా స్పందించారు. తారక్ ఇంటికి మరో క్రియేటివ్ బిల్బోర్డును పంపిస్తూ, “మీరు ‘నాటు నాటు’ ఎంత చేసినా, ఈ వార్ గెలిచేది మాత్రం నేనే” అనే డైలాగుతో కౌంటర్ ఇచ్చారు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ, “నైస్ రిటర్న్ గిఫ్ట్ హృతిక్ సర్” (Nice return gift Hrithik sir)అని ట్వీట్ చేశారు.

హృతిక్ పంపిన ఈ గిఫ్ట్‌పై ఎన్టీఆర్ స్పందిస్తూ.. “నైస్ రిటర్న్ గిఫ్ట్, హృతిక్ సర్” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఘుంగ్రూ’ అనేది ‘వార్’ చిత్రంలో హిట్ సాంగ్ కాగా ‘నాటు నాటు’ పాట ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ అని తెలిసిందే. దాంతో హీరోలిద్దరూ ఒకరి హిట్ సాంగ్ ను మరొకరు ప్రస్తావిస్తూ ఇలా సందడి చేశారు.

భారీ అంచనాల మధ్య రాబోతున్న వార్ 2

యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అధికారికంగా అడుగుపెడుతున్నారు. హృతిక్, ఎన్టీఆర్ ల కాంబినేషన్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సరదా ప్రమోషన్లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ranveer-singh-meets-elderly-fan-mumbai/cinema/527348/

bollywood Breaking News Ghungroo Hrithik Roshan Jr NTR latest news Naatu Naatu Telugu News tollywood war 2 War 2 Promotion

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.