తెలుగు తలపు నాట్యసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (Taraka Rama Rao) 102వ జయంతిని ఘనంగా జరిపారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఎంతో భావోద్వేగభరితంగా సాగింది.ఈ వేడుకకు సినీ ప్రముఖులు, సైనికాధికారులు, ప్రముఖ రచయితలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో కళావేదిక సంస్థ నిర్వహించింది. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (NTR Film Awards 2025)పేరుతో జరిపిన ఈ వేడుకలో, సేవాభిమానులకు ప్రత్యేక గౌరవం లభించింది.ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ దేశ రక్షక్ అవార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళావేదిక వ్యవస్థాపకురాలు భువన రాయవరపు నేతృత్వంలో ఈ అవార్డులు ప్రారంభమయ్యాయి. దేశ రక్షణలో అసామాన్య సేవలు అందించిన సైనికాధికారులకు ఈ గౌరవం లభించింది.
ఆపరేషన్ సింధూర్లో సేవలందించిన అధికారులు
మేజర్ జనరల్ ఎన్.ఎస్. రావు
మేజర్ భరత్
గ్రూప్ కెప్టెన్ పి.ఆర్. ప్రసాద్
కెప్టెన్ టి.ఎన్. సాయికుమార్
కళావేదికపై ప్రశంసలు వెల్లువ
ఈవెంట్లో ప్రముఖుల చేతుల మీదుగా ఈ వీరులకు అవార్డులు అందజేశారు. సైనికుల త్యాగాన్ని గుర్తించి వాళ్లను సత్కరించడం అభినందనీయం.ప్రముఖ నిర్మాతలు శ్రీమతి ఎన్.ఆర్. అనురాధ, చదలవాడ శ్రీనివాసరావు ఎన్టీఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందుకున్నారు. సినిమా రంగానికి వీరి సేవలను గౌరవిస్తూ ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ‘నట సార్వభౌముడు’ అనే ప్రత్యేక పత్రికను ఆవిష్కరించారు. ఇందులో ఎన్టీఆర్ జీవితం, సినిమా ప్రయాణం, రాజకీయ స్థాయిని వివరించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ, తాను అలాంటి మహనీయుడి కుమారుడినని గర్వంగా చెప్పారు.పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన, స్టార్ హీరోగా ఎదిగి, ఆపై ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ఒక విశేషమైన జీవితం, అని మోహనకృష్ణ చెప్పారు.ఎన్టీఆర్ కేవలం నటుడే కాదు, గొప్ప మానవతావాది కూడా అని అన్నారు. కరువు, తుఫాన్లు వచ్చినప్పుడు ఆయన తలదాచుకోలేదు. ప్రజలతోపాటు నడిచారు. ఆపత్కాలంలో విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అండగా నిలిచారు.కళావేదిక సంస్థ ఈ కార్యక్రమాన్ని ఎంతో అభినందనీయం గా నిర్వహించిందని మోహనకృష్ణ తెలిపారు. “ఎన్టీఆర్‌ను స్మరించడమే కాదు, నిజమైన హీరోలైన సైనికులను గౌరవించడం గొప్ప పని,” అని అన్నారు.
Read Also : Telangana : బిఆర్ఎస్ పాలనలో రూ. 3.5లక్షల కోట్ల పెట్టుబడులు – KTR