हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

అందంలో నే కాదు చదువులోనూ టాపే

Anusha
అందంలో నే కాదు చదువులోనూ టాపే

సినీ ప్రేక్షకులు తమ అభిమాన నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ చదువు, వారి కెరీర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో అధికంగా కనిపిస్తుంది. తాజాగా, దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో అత్యంత చదువుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసుకోవాలని సినీ లవర్స్ ఆసక్తి చూపుతున్నారు.

సాయి పల్లవి

మలయాళ సినిమా ప్రేమమ్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి, తన నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఫిదా సినిమాతో తెలుగులోకి ప్రవేశించిన ఆమె, తమిళంలో మారి 2,గార్గి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. కోయంబత్తూరులో పాఠశాల విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి, జార్జియా లోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ డిగ్రీ పొందింది. అయితే, వైద్య రంగాన్ని వదిలి తన సినిమా పట్ల ఉన్న ప్రేమ కారణంగా నటనను కెరీర్‌గా ఎంచుకుంది.సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేయడం విశేషం.

రష్మిక మందన్న

రష్మిక మందన్న ఛలో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప వంటి హిట్ చిత్రాలతో పాన్-ఇండియా స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం హిందీలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. చదువులోనూ రష్మిక మందన్న చాలా తెలివైన విద్యార్థిని. ఆమె బెంగళూరులోని ఎం.ఎస్. రామయ్య కాలేజీ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసింది. విద్యతో పాటు, మోడలింగ్, సినిమా రంగం వైపు మక్కువ పెంచుకున్న ఆమె, 2016లో హీరోయిన్‌గా పరిచయమై అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

ఐశ్వర్య లక్ష్మి

2019లో తమిళ హీరో విశాల్ సరసన యాక్షన్ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైన ఐశ్వర్య లక్ష్మి, ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా, 2021లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన జగమే తంతిరం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత మట్టి కుస్తీ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఆమెకు నిజమైన గుర్తింపు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1 , 2 చిత్రాల ద్వారా లభించింది. ఈ చిత్రాల్లో పూజావతి అనే పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

aishwaryalekshmisaipallavi 1731687159

ఐశ్వర్య లక్ష్మి కేవలం మంచి నటనే కాకుండా, చదువులోనూ మెరుగైన విద్యను పూర్తిచేసింది. ఆమె కేరళలోని ట్రివేండ్రం మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అయితే, చిన్నప్పటి నుంచే మోడలింగ్, నటనపై ఆసక్తి పెంచుకున్న ఐశ్వర్య, చివరికి సినిమా రంగాన్ని ఎంచుకుంది.ఈ హీరోయిన్స్ విద్యలో మంచి స్థాయిని సాధించినప్పటికీ, సినిమాపై మక్కువ కారణంగా నటనలో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870