📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Nivetha Pethuraj: ఎంగేజ్‌మెంట్ ఫొటోలు తొలగించిన నివేదా!

Author Icon By Anusha
Updated: December 9, 2025 • 2:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటి నివేదా పేతురాజ్ ఆకట్టుకునే పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. 2016లో తమిళ చిత్రం ‘ఓరు నాళ్ కోత్తు’తో సినీ రంగ ప్రవేశం చేసిన నివేదా (Nivetha Pethuraj), ఆ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీ విష్ణు సరసన నటించిన ‘మెంటల్ మదిలో’తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

Read Also: Prabhas: జ‌పాన్‌లో భూకంపం.. ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: ద‌ర్శ‌కుడు మారుతి

పెళ్లి రద్దయిందనే ఊహాగానాలు

ఇటీవల నివేదా (Nivetha Pethuraj) వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్‌కి చెందిన మలయాళీ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ముందుగా గోప్యంగా ఉంచి, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే, తాజాగా నివేదా, రాజ్ హిత్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను తొలగించడంతో వీరి పెళ్లి రద్దయిందనే ఊహాగానాలు బలపడ్డాయి.

Nivetha deleted her engagement photos!

నివేదా పేతురాజ్ సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉండటంతో, ఆమె వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తోందని అంతా భావించారు. అయితే, ఉన్నట్టుండి ఇద్దరూ తమ ఫొటోలను డిలీట్ చేయడంతో వారి మధ్య బ్రేకప్ జరిగిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై నివేదా పేతురాజ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

engagement update latest news Nivetha Pethuraj Raj Hith Ibran Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.