📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Nithin : జూలై 4న ‘తమ్ముడు’ విడుదల

Author Icon By Divya Vani M
Updated: May 4, 2025 • 8:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హీరో నితిన్ కోసం హిట్ సినిమానే ఇప్పుడు అత్యవసరం.గత కొంతకాలంగా కమర్షియల్ సక్సెస్ ను దూరమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే తన తదుపరి చిత్రం “తమ్ముడు”పై భారీగా నమ్మకముంచాడు.ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది.“తమ్ముడు” విడుదల తేదీని చిత్రబృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది.శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ మూవీ జూలై 4న థియేటర్లకు రానుంది.రిలీజ్ డేట్ ప్రకటన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఇటీవల దర్శకులు తమ సినిమాల ప్రమోషన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు.“తమ్ముడు” కూడా అదే రూట్ ఫాలో అయింది.

Nithin జూలై 4న ‘తమ్ముడు’ విడుదల

రిలీజ్ డేట్ ప్రకటనను ఓ ఫన్నీ వీడియో రూపంలో రూపొందించారు.ఇందులో సినిమాలో నటించిన యాక్టర్లు ఒక్కొక్కరుగా డైరెక్టర్ దగ్గరకు వస్తారు.వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, సప్తమి గౌడ, లయ, బేబి శ్రీరామ్ దీత్య – ఒక్కొక్కరూ డైరెక్టర్ శ్రీరామ్ వేణును కలిసి, బర్త్ డే విషెస్ చెప్పినట్టుగా కనిపిస్తారు.కానీ వెంటనే వాళ్లు సార్.సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు.వర్ష బొల్లమ్మ –నేను నా ప్రమోషన్ నానే చేసుకుంటున్నా సార్, మీమ్స్ కూడా నానే వేస్తున్నా, డేట్ చెప్పండి! అని చిలిపిగా అడుగుతుంది.లయ అయితే – నా పోస్టర్ ఎక్కడ సార్? అసలు నేను ఈ సినిమాలో ఉన్నానా లేదా?

అని గగ్గోలు పెడుతుంది.అంతే కాదు, చిన్నారిగా కనిపించే బేబి శ్రీరామ్ దీత్య మాట్లాడుతూ –మూవీ స్టార్ట్ అయినప్పుడు నేను 3వ తరగతిలో ఉన్నా సార్.ఇప్పుడేమో 5వ తరగతిలో చదువుతున్నా! రిలీజ్ డేట్ చెప్పండి! అంటుంది.ఈ ప్రశ్నలతో డైరెక్టర్ శ్రీరామ్ వేణు నోటి మాట బయట పడదు. ఇంకోసారి చెప్తా అంటూ అందరినీ పంపేస్తాడు.అయితే చివర్లో, సడెన్ ట్విస్ట్! వీడియో చివర్లో దిల్ రాజు, శిరీష్ కలిసి శ్రీరామ్ వేణుకు బర్త్‌డే కేక్ కట్ చేయిస్తారు.వెంటనే ఆనందంగా జూలై 4న ‘తమ్ముడు’ రిలీజ్ అని అధికారికంగా వెల్లడిస్తారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలు సాగింది.అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ, “తమ్ముడు” నితిన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా? అన్నది ఆసక్తికర విషయం.ట్రైలర్, సాంగ్స్ మీదే ఈ సినిమాపై హైప్ ఇకపై పెరగనుంది.

Read Also : Re-release : జగదేకవీరుడు అతిలోకసుందరి రూ.6.50 టికెట్ ను రూ.210కి అమ్మారట!

Dil Raju Production 2025 Nithiin 2025 Movie Updates Nithiin Tamudu Movie Release Date Sriram Venu New Movie Tamudu Movie Cast and Crew Tamudu Movie Promotions Tamudu Telugu Movie Trailer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.