నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ (Swayambhu) విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. విడుదల తేదీ అనౌన్స్ చేస్తూ మూవీ టీమ్ ప్రత్యేక వీడియో ‘రైజ్ ఆఫ్ స్వయంభు’ని రిలీజ్ చేసి సినిమా స్కేల్‌పై ఒక గ్లింప్స్ చూపించారు.
‘కార్తికేయ 2’ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్(Nikhil), ఈసారి పాన్ వరల్డ్ లెవెల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడిగా భరత్ కృష్ణమాచారి తొలి ప్రయత్నమే అయినా, విజువల్స్ స్కేల్ చూస్తుంటే సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిందని స్పష్టమవుతోంది.
Read Also: Balakrishna: బాలకృష్ణ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్?
ఎనిమిది భాషల్లో విడుదల
ఈ చిత్రం ఎనిమిది భాషల్లో విడుదల కావడం విశేషం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిక్. అధిక స్థాయి సెట్లతో, వార్ సీక్వెన్సెస్‌తో పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న ‘స్వయంభు’(Swayambhu) నిఖిల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.
పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై
ఈ సినిమాలో సమ్యుక్తా, నభా నటేష్ కథానాయికలుగా కనిపించనున్నారు. వారిద్దరి పాత్రలు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు సమాచారం. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, టాగూర్ మధు చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు.
కెమెరామెన్ కె.కె. సెంటిల్ కుమార్ విజువల్స్‌కి భారీ స్థాయిలో జీవం పోశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి పేరుగాంచిన రవీ బస్రూర్(Ravi Basrur) సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను ఎం. ప్రభాహరన్, రవీంద్ర కలిసి పర్యవేక్షిస్తున్నారు. వారి నిర్మాణ విలువలు, భారీ సెట్స్ సినిమా విజువల్ గ్రాండియర్‌కి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. రిలీజ్ డేట్ ప్రకటించడంతో సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: