రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా (Toxic Movie) విడుదలకు ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బృందం, ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉంది. నేషనల్ అవార్డు విన్నర్ గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ (Monster Mind Creations) బ్యానర్లపై యష్, వెంకట్ కె. నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Also: Tarun Bhaskar: ‘ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ రిలీజ్
కౌంట్‌డౌన్ పోస్టర్ విడుదల
పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం (Toxic Movie) మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమా విడుదలకు ఇంకా 100 రోజులే ఉండడంతో ఈ విషయాన్ని తెలుపుతూ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్: టీపీ అబిద్, యాక్షన్ డైరెక్టర్లు: జేజే పెర్రీ, అన్బరివ్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: