📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Netflix: సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్: భారీ ధరల కొనుగోళ్లు స్టాప్!

Author Icon By Tejaswini Y
Updated: November 22, 2025 • 10:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) దక్షిణాది సినిమా రంగానికి, ముఖ్యంగా తెలుగు–తమిళ నిర్మాతలకు పెద్ద దెబ్బగా చెప్పుకోవాల్సిన నిర్ణయం తీసుకుంది. ఇకపై సౌత్ సినిమాల డిజిటల్ హక్కులను అధిక ధరలకు కొనుగోలు చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్టు కంపెనీ స్పష్టం చేసినట్లు తెలిసింది. దాని బదులుగా భారత మార్కెట్‌కు అనుగుణంగా స్వంత వెబ్ సిరీస్‌(Web series)లు, రియాలిటీలతో పాటు ఒరిజినల్ సినిమాల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఏర్పాట్లు వేగవంతం చేసింది.

Read Also: Delhi schoolboy suicide : ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య తర్వాతి SRK అవ్వాలి’ అన్న బాలుడు…

Netflix deals a big shock to South movies Stop buying at high prices!

శాటిలైట్ హక్కుల అమ్మకాలు

ఇటీవలి కాలంలో థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోవడం వల్ల సినీ పరిశ్రమ కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. శాటిలైట్ హక్కుల అమ్మకాలు కూడా ముందు మాదిరిగా లాభాలు ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో పెద్ద సినిమాలకు ఓటీటీ(OTT) హక్కులే ప్రధాన ఆదాయ మార్గంగా మారాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ పెద్ద మొత్తంలో చెల్లించి నిర్మాతలకు భారీ ఆర్థిక ఊరట కలిగించేది. అయితే థియేటర్లలో డిజాస్టర్ అయినప్పుడు, ముందు చెప్పిన మొత్తాన్ని తగ్గించే ప్రాక్టీస్ కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి.

ప్రీమియం ధరలు

ఇప్పుడు ఈ కొత్త పాలసీతో నిర్మాతలు మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌ వంటి ప్రీమియం ధరలు ఇచ్చే వేదిక ఇక ఆఫర్లు తగ్గించడంతో, ముందు మాదిరిగా భారీ బడ్జెట్ సినిమాలు చేయాలంటే నిర్మాతలు మళ్లీ ఆలోచించాల్సి ఉంటుంది. నిర్మాణ ఖర్చు తగ్గించుకోవడం, లేకపోతే స్టార్ హీరోలు తమ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోవడం తప్ప మరొకమార్గం ఉండకపోవచ్చని పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Digital Rights Film Industry Movie Business Netflix OTT OTT rights Producer Issues South Cinema Tamil Cinema Telugu cinema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.