అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) నటిస్తున్న NC24 సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విడుదల చేయనున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అకినేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఘట్టమనేని అభిమానుల్లో కూడా ఈ అప్‌డేట్ హైప్ సృష్టించింది. తండేల్’ విజయంతో మంచి ఊపుమీదున్న నాగచైతన్య ఈసారి పూర్తిస్థాయి యాక్షన్–ఎమోషనల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.
Read Also: Balakrishna: ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్
NC24 – విభిన్న కథతో వస్తున్న చైతూ
‘విరూపాక్ష’ విజయంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. BVSN ప్రసాద్ నిర్మిస్తుండగా, సినిమాకు సుకుమార్ సమర్పకుడు. ఈ మూవీలో చైతూ సరసన నటిస్తున్న మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ కూడా మంచి స్పందన అందుకుంది. ఆమె “దక్ష” అనే పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనుందని యూనిట్ తెలిపింది. ఈ పాత్ర ఆమె కెరీర్‌లో నూతన మలుపు అవుతుందని తెలుస్తోంది.
మహేశ్‌బాబు చేతుల మీదుగా టైటిల్ రివీల్
మేకర్స్ ప్రకటించిన ప్రకారం:
- టైటిల్ రివీల్ + నాగచైతన్య ఫస్ట్ లుక్
- ఉదయం 10:08 – ఆదివారం
- లాంచ్ చేయబోయేది: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
అక్కినేని – ఘట్టమనేని ఫ్యాన్స్ ఈ సందర్భాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
NC24 మిథికల్ యాక్షన్ అడ్వెంచర్
సినిమా ఒక మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. భారీ బడ్జెట్‌తో, టాప్-నాచ్ టెక్నికల్ వర్క్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రతి అప్‌డేట్ మూవీపై ఆసక్తిని పెంచేసింది. చైతన్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 23న టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల అవ్వడం అభిమానుల్లో పెద్ద ఎంటిసిపేషన్ క్రియేట్ చేసింది. ‘వృషకర్మ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో చూడాలి.
మహేశ్‌బాబు కొత్త సినిమా ‘వారణాసి’ గురించిన సమాచారం
మహేశ్‌బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్నారు. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో టైటిల్ & కాన్సెప్ట్ వీడియో విడుదల కాగా, అద్భుతమైన స్పందన లభించింది. 2026 సమ్మర్లో విడుదల కానున్న ఈ సినిమాలో మహేశ్ రాముడి పాత్రలో కనిపించనున్నట్లు రాజమౌళి ప్రకటించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: