📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Anaganaga oka raju Trailer: ‘అన‌గ‌న‌గా ఒక రాజు’ ట్రైల‌ర్ చూసారా!

Author Icon By Anusha
Updated: January 8, 2026 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Naveen Polishetty-Have you seen the trailer for ‘anaganaga oka raju’?

యువ నటుడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘అనగనగా ఒక రాజు’. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్.. ఆ తర్వాత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు సంక్రాంతి పండక్కి, థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ జోడిగా సక్సెస్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది.

Read Also: Sankranthi Movies: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘పరాశక్తి’ సినిమా?

అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం నేడు (జనవరి 8న) అత్యంత గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) మరోసారి బాక్సాఫీస్ వద్ద తన కామెడీ పవర్‌ను పక్కాగా చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా కింగ్ అక్కినేని నాగార్జున ఈ ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ అందించడం ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి.

రాజు గారి కోసం బంగార్రాజు రంగంలోకి దిగారు అన్నట్లుగా సాగిన ఆయన బేస్ వాయిస్ ట్రైలర్‌కు మరింత జోష్‌ను అదనపు ఆకర్షణను ఇచ్చింది. గోదావరి జిల్లా నేపథ్యంలో, పెళ్లి చుట్టూ తిరిగే గందరగోళం, హుషారైన డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ఇందులో నవీన్ ఎనర్జీకి తోడు, హీరోయిన్ మీనాక్షి చౌదరి అందం కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

anaganaga oka raju Trailer release latest news Naveen Polishetty Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.